తరాలు మారిన తమ తలరాతలు మార లేదు

తరాలు మారిన తమ తలరాతలు మార లేదు

Share with
Views : 3
తరాలు మారిన తమ తలరాతలు మారలేదన్నట్టుంది వాళ్ళ జీవనస్థితి. ఏళ్లు గడుస్తున్న కనీస సౌకర్యాలు వారికి ఆమడ దూరమే. ఎంతమందిని మొరపెట్టుకున్నా సమస్య తీరనే లేదు. ఆ ఆదివాసీలకూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక తాగు నీటి కోసం కిలోమీటర్లునడిచి నీటి చలమలపై ఆధారపడుతున్నారు కొంతమంది గిరిజనులు. అల్లూరి జిల్లాలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ కనీసం తాగునీరు లేక బురద నీటిని గొంతులో దింపుకుంటున్నారు. మా దాహం కేకలు వినిపించడం లేదా అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ ఆదివాసీలు. ఇటీవల అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చేతులు జోడించి.. జిల్లా కలెక్టర్, అధికారులను వేడుకుంటూ మోకాళ్లపై నిల్చోని ఖాళీ బిందెలో నెత్తిన పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు ఆదివాసి గిరిజన మహిళలు. ఇప్పుడు ముంచంగిపుట్టు మండలంలో.. గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దారెల పంచాయితీ పరిధి పెదకూటలో తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయి చేతి పంపు నీరు చుక్క కూడా రావడం లేదు. దీంతో ఇక చేసేది లేక కిలోమీటర్ దూరం ఉన్న వాగులకు క్యూ కడుతున్నారు అడవి బిడ్డలు. సూర్యోదయాన్ని బయలుదేరి వాగులో ఉన్న ఆ బురద నీటినే తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆ నీటితోనే గొంతు తడుపుకొని దాహం తీర్చుకుంటున్నారు. వాగులో నీటి కుంటలు తవ్వుకుంటూ.. గిరిజనులు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. దీంతో ఇక చేసేది లేక కిలోమీటర్ దూరం ఉన్న వాగులకు క్యూ కడుతున్నారు అడవి బిడ్డలు. సూర్యోదయాన్ని బయలుదేరి వాగులో ఉన్న ఆ బురద నీటినే తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆ నీటితోనే గొంతు తడుపుకొని దాహం తీర్చుకుంటున్నారు. వాగులో నీటి కుంటలు తవ్వుకుంటూ.. గిరిజనులు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले