రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు* *రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*

రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు* *రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*

Share with
Views : 6
*రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు* *రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా* అమరావతి జూన్ 1: రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీ ల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసాధారణమైనవని, ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్, శుద్ధమైన ఓటరు జాబితాను చూసిందని మరియు అన్నింటికంటే మించి ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఓట్ల లెక్కింపు యొక్క క్లిష్టమైన దశకు చేరుకున్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన సవాలను గుర్తు చేశారు.తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపుకు ముందు, లెక్కింపు రోజున మరియు తరువాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటన అనంతరం ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తరువాత తలెత్తే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైనా ఆటంకాలు తలెత్తితే వాటిని దృఢంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని, ఎన్నికల నియమాలు, 1961, రూల్ 53 (4) యొక్క ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే లేదా ఆర్ఓ యొక్క చట్టబద్ధమైన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఏ వ్యక్తిని అయినా ఓట్ల లెక్కింపు స్థలం నుండి పంపించే అధికారాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలను కఠినంగా అదుపు చేయాలన్నారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు మరియు సంభావ్యంగా ఇబ్బంది కలిగించేవారి నిరంతర పర్యవేక్షణను నిర్ధారించాలన్నారు. ఎంతో కీలకమైన ఈ పరిస్థితుల్లో ఏదైనా తప్పుడు వార్తలు లేదా పుకార్లను వెంటనే ఖండించాలని మరియు అన్ని సంఘటనలపై ఉన్నత అధికారులు, ఇసిఐ, ప్రెస్/మీడియా మరియు రాజకీయ పార్టీలతో సరైన కమ్యూనికేషన్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కర్తవ్యం నిర్వహణలో అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండాలని, ఈ కీలకమైన కాలంలో శాంతిభద్రతలను కాపాడుకోవడంలో చేసే ప్రయత్నాలు ఎంతో అమూల్యమైనవని మరియు మీరంతా సమిష్టిగా సవాళ్లను ఎదుర్కొంటారనే నమ్మకం నాకు గట్టిగా ఉందంటూ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले