స్ట్రాంగ్ రూంలు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి*

స్ట్రాంగ్ రూంలు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి*

Share with
Views : 6
శ్రీకాకుళం, జూన్ 01: స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. శ్రీ శివానీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూంలను నియోజకవర్గాల వారీగా ఆముదాలవలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూంలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూము నుండి కౌంటింగ్ రోజున ఈవీఎంలను కౌంటింగ్ గదులకు తీసుకువచ్చే విధానాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ నుండి పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఆంబులెన్స్ లు నిలుపు స్థలం, వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనున్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, తదితరమైనవి ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, జడ్పీ సీఈవో డి. వెంకటేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డిపిఓ వెంకటేశ్వరరావు, చల్లా ఓబులేసు, డిప్యూటీ సిఈఓ వెంకటరామన్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले