కూటమి గెలుపు ఖాయం

కూటమి గెలుపు ఖాయం

Share with
Views : 6
ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం ఖాయమని అంచనా వేశాయి. అలా ఇలా కాదు… కూటమికి ఇరవై నుంచి ప్రారంభమవుతాయి. ఇరవై ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించవచ్చు. వైసీపీకి సున్నా నుంచి ప్రారంభమవుతాయి.. చివరికి అది ది బెస్ట్ అన్న పొజిషన్‌లో నాలుగు దగ్గర ఆగుతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా మందిని ఆశ్చర్యపర్చలేదు. పెయిడ్ మేధావులు కొంత మందికి దిగ్భ్రాంతికి కలిగించి ఉంటాయి అంతే. ఎందుకంటే.. గతంలోనే ఇలాంటి వేవ్ ఉందన్న విషయం స్పష్టమయింది. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి వచ్చిన ఓట్లు చూసిన ఎవరికైనా ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం ఉందని తెలుస్తుంది. దీన్ని గుర్తించడానికి వైసీపీ సిద్ధపడలేదు. మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ కూడా అలాగే కళ్లు మూసుకుంది. తర్వాత తమ పరిస్థితి రాను రాను దిగజార్చుకుంటూ వచ్చింది. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకూడదన్న చంద్రబాబు బీజేపీతో కలవడానికి ఏ మాత్రం ఆలోచించలేదు. పవన్ కల్యాణ్ తో కలిసి .. సమైక్య పోరాటం చేశారు. టీడీపీ ఒంటరిగా గెలవగలదు కానీ.. జగన్ మళ్లీ రాడన్న నమ్మకం ప్రజలు, ఇన్వెస్టర్లలో కలిపించారంటూ… వైసీపీని తుడిచి పెట్టేసే విజయం రావాలని .. అందుకే పొత్తులు పెట్టుకున్నామని లోకేష్ చాలా సార్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అదే నిజమని నిరూపించేలా ఉన్నాయి. వైసీపీ నేతల అహంకారం.. ఐదేళ్ల పాటు చేసిన అరాచకానికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పబోతున్నారని స్పష్టమవుతోంది. మొత్తంగా వైసీపీ ఘోర పతనానికి ఇంకొక్క రెండు రోజులే ఉందని… జాతీయ మీడియా తేల్చింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले