రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు

Share with
Views : 8
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కౌంటింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసిరుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు పోలీసులు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులుపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేదమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి ప్రోద్భలంతో పోస్టులు పెడుతున్నారో విచారించి చర్యలు తీసుకుంటామంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే.. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని.. గ్రూప్ అడ్మిన్‌లు అలెర్ట్‌గా ఉండాలని డీజీపీ హరీష్‌గుప్తా హెచ్చరించారు. కాగా మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 8.30 గంటలకి EVM కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట EVM కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందన్నారు. కాగా కౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले