ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి లేఖ రాసిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు*

ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి లేఖ రాసిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు*

Share with
Views : 10
*తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి లేఖ రాసిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు* • అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసింది. • ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు. • చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. • ఆర్.బి.ఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల అప్పులకు ధరఖాస్తు చేసింది. • ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సిఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న రూ.4 వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారు. • జూన్ 4, 2024 న ఎన్నికల ఫలితాల రానున్న నేపద్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధం. • కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోగలరు. • ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోగలరనీ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले