ఎన్డీయేలో చంద్రబాబే ఇప్పుడు కింగ్‌ మేకర్.. ఎలా సాధించారు?

ఎన్డీయేలో చంద్రబాబే ఇప్పుడు కింగ్‌ మేకర్.. ఎలా సాధించారు?

Share with
Views : 3
అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతట అదే హస్తిన నుంచి అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే.. అయాచితంగా ఎన్డీయేలో కింగ్‌ మేకర్‌గా నిలిచారు చంద్రబాబు. ఇది ఊహించని ఫలితం. అడక్కుండానే వచ్చిన అద్భుత అవకాశం. లోకల్‌గా గెలిస్తే చాలనుకుంటే.. కేంద్రంలో చక్రం తిప్పే ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కింది. సెంట్రల్‌లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందనేది అంతా ఊహించిందే. ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే.. బీజేపీకే సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది.. ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంతా. కాని, అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతట అదే హస్తిన నుంచి అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే.. అయాచితంగా ఎన్డీయేలో కింగ్‌ మేకర్‌గా నిలిచారు చంద్రబాబు. ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఒకప్పుడు ఈమాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా. సోషల్‌ మీడియాలో తెగ వెక్కిరించారు. పాతిక సీట్లకు కూడా పోటీ చేయని టీడీపీ.. ఎన్డీయేలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటని ఒకవిధంగా ఎగతాళిగానే మాట్లాడారంతా. కాని, ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీయేగా అవతరించింది టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీయేలో.. ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం. ‘నాయుడు ది కింగ్‌మేకర్‌’ అంటూ నేషనల్‌ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. నితీష్‌ కుమార్‌ కూడా కింగ్‌ మేకర్‌లో ఒకరు. ఈ ఇద్దరే ప్రస్తుత ఎన్డీయే కూటమిని రక్షించేది. కాకపోతే.. జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. సో, కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. పైగా టీడీపీ కూటమి గెలవగానే.. ప్రధాని మోదీ, అమిత్‌షా నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ‘ఒకసారి కలుద్దాం’ అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది. పైగా ఎన్డీయే కన్వీనర్‌గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. అదే నిజమైతే.. ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క. ఇక.. చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. టీడీపీనే కీ-ఫ్యాక్టర్‌గా మారడంతో రేప్పొద్దున కేంద్ర క్యాబినెట్‌లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు. మొత్తానికి, బీజేపీకి టీడీపీ అవసరమే ఉందనిపించేలా.. పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామం. అయిపోయిందిక.. చంద్రబాబు పని అయిపోయింది. జగన్ ప్రభంజనం చూసి టీడీపీ తట్టాబుట్టా సర్దుకుంటుందేమో అనుకున్నారు 2019లో. ఈ దఫా గానీ టీడీపీ అధికారంలోకి రాలేదో.. ఇక ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అని కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా.. ఈసారి గెలవకపోతే పార్టీ పని అయిపోయినట్టేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. కాని, చంద్రబాబు నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా.. గెలిచిన 23 మందిలో ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నా.. పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు. అలా ఇలా కాదు.. ఎదురుగా ఉన్నది సునామీని మించిన బలమైన పార్టీ అని తెలిసినా.. ఎదురెళ్లి పోరాడారు. ఆ పోరాట పటిమకు సునామీనే తలవంచింది. టీడీపీకి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించింది. 151 కాదు.. అంతకుమించిన ఫలితాలు సాధ్యమేనని నిరూపించారు చంద్రబాబు అండ్‌ టీమ్. నిజానికి, అసెంబ్లీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి, లోక్‌సభ ఫలితాల్లో తేలిపోతే.. చంద్రబాబును, టీడీపీని బీజేపీ అంతగా కేర్‌ చేసే వాళ్లే కాదేమో. ఏపీలో ఎవరు గెలిచినా, ఎవరికెన్ని ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో ఉన్న బీజేపీకి నెంబర్స్ మాత్రమే కావాలనేది విశ్లేషకులు చెప్పిన మాట. నిజంగా అదే జరిగి ఉంటే.. చంద్రబాబును పట్టించుకునే వారే కాదేమో. కాని, జగన్‌ కోరుకున్నట్టు ఎన్డీయేకి మెజారిటీ తగ్గింది. గత ఐదేళ్లుగా జగన్‌ కోరుకున్నది ఇదే. ‘బీజేపీకి సీట్లు తగ్గాలి, కేంద్రంలోని ప్రభుత్వానికి మన అవసరం రావాలి.. అప్పుడే మనం చెప్పినట్టు కేంద్రం వింటుంది’ అని జగన్‌ చెబుతూ వచ్చారు. సరిగ్గా అలాగే జరిగిందిప్పుడు. కాని, రాష్ట్రంలో అధికారం మారింది. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले