వైసీపీ వెన్నెముక విరిగింది.. కంచుకోటలో కుప్పకూలింది

వైసీపీ వెన్నెముక విరిగింది.. కంచుకోటలో కుప్పకూలింది

Share with
Views : 6
వైసీపీకి వెన్నెముక విరిగింది. ఆ పార్టీకి బ్యాక్‌బోన్‌ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలింది. సీమలో సీన్‌ రివర్స్‌ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీని ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్‌ బోనస్‌గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, ఫ్యాను పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్‌గా చెప్పాలంటే వైసీపికి బ్యాక్‌బోన్‌ లాంటిది రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజారిటీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్తా ఖాళీ కోటగా మారిపోయింది. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్‌ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్లు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది. అలాంటి కడప జిల్లాలో.. 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం, వైసీపీకి బిగ్‌ షాక్‌ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో రెండు సీట్లు తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ, ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్‌తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले