ప్రతిపక్షణాయకులపై జగన్ విమర్శలు

ప్రతిపక్షణాయకులపై జగన్ విమర్శలు

Share with
Views : 107

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నాన్‌ రెసిడెంట్‌ నాయకులని సీఎం జగన్‌ అన్నారు. వాళ్లు మన రాష్ట్రంలో ఉండరని..

దోచుకోవడం కోసమే అధికారం కావాలంటున్నారని విమర్శించారు. అమూల్‌ ఆధ్వర్యంలో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడారు.

రూ.325కోట్ల పెట్టుబడికి అమూల్‌ సంస్థ ముందుకొచ్చిందని జగన్‌ చెప్పారు. చిత్తూరు డెయిరీ దుస్థితిని చూసి ఇవాళ జీవం పోస్తున్నామన్నారు. సహకార రంగంలో ఈ డెయిరీ అతిపెద్దదని చెప్పారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు డెయిరీ సహా 54 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయని జగన్‌ ఆరోపించారు. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదన్నారు. రాజకీయ జీవిత చరమాకంలో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నామంటున్నారని వ్యాఖ్యానించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले