బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

Share with
Views : 104
బంగాళాఖాతంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జూలై 4, 5 తేదీల్లో ఆంధ్ర జిల్లాలు .. బాపట్ల, ఎన్.టీ.ఆర్, కృష్ణా, ఏలూరు, కోనసీమ,ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు,నంధ్యాల,అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

మిగిలిన జిల్లాలు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు .. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले