భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెడతా: చంద్రబాబునాయుడు

భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెడతా: చంద్రబాబునాయుడు

Share with
Views : 107
*అమరావతి*:*అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు* *విజయవాడ ఎ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు* *అధికారంలోకి వచ్చాక అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటు చేస్తాం:- టీడీపీ అధినేత చంద్రబాబు* *భోగాపురం ఎయిర్ పోర్టు కు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం:- టీడీపీ అధినేత చంద్రబాబు* *సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-* • 100 ఏళ్ల క్రితం 27 ఏళ్ల వయసులో చనిపోయిన వ్యక్తి అల్లూరి. అలాంటి వ్యక్తిని ఇప్పటికీ సమాజం గుర్తుపెట్టుకుంది అంటే అదీ అతని గొప్పతనం. • అల్లూరి 125 జయంతి ఉత్సవాలను ప్రధాని గత ఏడాది ప్రారంభించారు. • నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏ గిరిజనుల తో కలిసి అల్లూరి ఉద్యమం చేశాడో...ఆ గిరిజన మహిళ నేడు రాష్ట్ర పతిగా ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. • చిన్న వయసులోనే ప్రజల కోసం పోరాటం చేయాలనే ఆలోచన చేసిన వ్యక్తి అల్లూరి • నాటి మద్రాసు ప్రభుత్వం మన్యంలో అమలు చేసే చట్టాలు....గిరిజన ప్రాంతాల్లో అఘాయిత్యాలు చూసిన తరువాత ప్రజలకు అండగా నిలబడాలి అని అల్లూరు ముందు అడుగు వేశాడు. • 40 గ్రామాల్లో 300 మంది గిరిజన యోధులను తయారు చేసుకుని బ్రిటీష్ వారిపై పోరాడారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు సేకరించి యుద్దం చేశాడు. • గాంధీ అహింస తో స్వాతంత్ర్య ఉద్యమం చేస్తే...అల్లూరి, భగత్ సింగ్, నేతాజీ సాయుధ పోరాటం ద్వారా ఉద్యమం చేశారు. • 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సమయంలో....బ్రిటీష్ దేశానికి భారతీయుడు ప్రధాని అయ్యారు. ఇదీ భారత దేశం గొప్పదనం. • 2047 నాటికి దేశం ప్రపంచంలో శక్తివంత మైన జాతిగా తెలుగు జాతి తయారు అవుతుంది. అగ్రదేశంగా భారత్ ఉంటుంది. • పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశ పురోగమనం ప్రారంభం అయ్యింది. • ఆ తరవాత వచ్చిన టెక్నాలజీని మనం అందిపుచ్చుకుని ప్రగతి సాధించాం. • ప్రపంచంలో ఎక్కువ యువకులు ఉన్న దేశం భారత దేశం. ఇది దేశాన్ని శక్తి వంతం గా మార్చుతుంది. • అల్లూరి స్ఫూర్తితో యువత ప్రపంచానికి సేవ చేయాలి. • భారత దేశంలో కుల వ్యవస్థ ఉంది. మత వ్యవస్థ ఉంది. కులం అనేది ఇంటికే పరిమితం అవ్వాలి...బయట మాత్రం సమాజంలో అంతా కలిసి ఉండాలి. • సమాజానికి ఉపయోగపడే నేతలను మనం తయారు చేసుకుంటే మేలు జరుగుతుంది. • అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని 2014 లో జీవో ఇచ్చాను. • బాలయోగి స్పీకర్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలు పార్లమెంట్ లో ఉండాలని నాడు లేఖ రాశాం. • ఎర్రనాయుడు హౌస్ కమిటీ లో ఉండి దానికి ఆమోదం తెచ్చారు. • డిల్లీ పార్లమెంట్లో అల్లూరి చిత్రపటం లేదా విగ్రహం ఏర్పాటు చేయాలి. • కేంద్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం • రాష్ట్రపతి కూడా హైదరాబాద్ వచ్చి అల్లూరి జయంతిలో పాల్గొన్నారు. • కానీ ఎపిలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లూరి కార్యక్రమాన్ని నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఏముంది? • రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతి ఉత్సవాలు ఎందుకు నిర్వహించలేదు? సాంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదు? •అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటు చేస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టు కు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం. • అల్లూరి లాంటి వారి జీవితాలను భావితరాలకు అందించాలి. • 100 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని నేడు గుర్తుపెట్టుకోవడానికి కారణం...ఆయన చేసిన పోరాటం. • స్వాతంత్ర్య ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన అల్లూరి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले