అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై లోక్‌సభ సచివాలయం కీలక బులెటిన్

అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై లోక్‌సభ సచివాలయం కీలక బులెటిన్

Share with
Views : 110

దివంగత నేత, వైస్ఆర్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ అవుతారంటూ అనేక వచ్చాయి కూడా.

అయితే, తాజాగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై లోక్‌సభ సచివాలయం కీలక బులెటిన్ విడుదల చేసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై సీబీఐ సమాచారం ఇస్తూ రాసిన లేఖ తమకు అందినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. లేఖలో సీబీఐ పేర్కొన్న అంశాలను బులెటిన్‌లో పొందుపరిచింది లోక్‌సభ సచివాలయం.

ఈ బులెటిన్ ప్రకారం.. 'జూన్‌ 3వ తేదీన అవినాశ్‌ను అరెస్టు చేసి, వెంటనే రూ.5 లక్షల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో విడుదల చేశాం' అని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే వెంటనే బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే అవినాశ్‌ను విడుదల చేశామని లేఖ రాసింది సీబీఐ. ఈ లేఖ సారాంశాన్ని తెలుపుతూ తాజాగా లోక్‌సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले