అలాచేస్తే.. అన్నదాతలు ఇంధనదాతలవుతారు..! రూ.15కే లీటర్ పెట్రోల్.. కేంద్ర మంత్రి గడ్కరీ న్యూ ఫార్ములా

అలాచేస్తే.. అన్నదాతలు ఇంధనదాతలవుతారు..! రూ.15కే లీటర్ పెట్రోల్.. కేంద్ర మంత్రి గడ్కరీ న్యూ ఫార్ములా

Share with
Views : 103
పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనం నడపాలంటే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీటర్ పెట్రోల్ హైదరాబాద్ లో ప్రస్తుతం రూ. 110 ఉంది. పెరిగిన పెట్రోల్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వీరి ఇబ్బందులకు చెక్ పడేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ చెప్పిన ఫార్ములా అమల్లోకి వస్తే రూ. 15కే లీటర్ పెట్రోల్ అందుబాటులోకి వస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో గడ్కరీ పాల్గొని పలు విషయాలు వెల్లడించారు.ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. త్వరలోనే అన్ని వాహనాలు రైతులు తయారు చేసే ఇథనాల్ తోనే నడుస్తాయని అన్నారు. 60శాతం ఇథనాల్, 40శాతం విద్యుత్ సగటు తీస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 15 అవుతుందని అన్నారు. రైతులు కేవలం అన్నదాతలే కాదు ఇంధనదాతలు కావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని కేంద్ర మంత్రి చెప్పారు.

కేంద్ర మంత్రి చెప్పిన విధంగా చేయడం వల్ల ప్రజలకు మేలు జరగడమే కాకుండా చమురు దిగుమతులు కూడా తగ్గుతాయి. ఫలితంగా రూ. 16లక్షల కోట్ల చమురు దిగుమతులు ఆదాయమంతా రైతులకే వెళ్తుంది. దీంతో గ్రామాల ఆదాయం పెరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినదాని ప్రకారం.. వచ్చే నెలలో ఇథనాల్‌తో నడిచే టయోటా కంపెనీ వాహనాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, ఇన్నోవా సహా అన్ని వాహనాలు రైతులు తయారు చేసే ఇథనాల్ తో నడుస్తాయని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. గడ్కరీ వ్యాఖ్యలు వాహన దారుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले