ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తున్నాయా?

ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తున్నాయా?

Share with
Views : 103

పీలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ క్రియేట్‌ చేసింది ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు.

అయితే ఈ భేటీ వెనుక అసలు రహస్యం ఏపీలో ముందస్తు ఎన్నికలేనని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవడం ఒక్కసారిగా వాతావరణాన్ని హీటెక్కించింది. మోదీతో గంటకు పైగా భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌… ప్రధానితో ముందస్తు ఎన్నికల ప్రస్థావన తెచ్చినట్టు జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. తెలంగాణ సహా 5 రాష్ట్రాలతోపాటు.. ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని జగన్‌ ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. ప్రధానితో భేటీకి ముందు అమిత్‌షాతో సైతం జగన్‌ భేటీ అయ్యారు. ఆ తరువాత నిర్మలాసీతారామన్‌తో సైతం జగన్‌ సమావేశమయ్యారు. అయితే అమిత్‌షా దగ్గర కూడా జగన్‌ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న విషయం ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట అసెంబ్లీ ఎన్నికలతో పాటు జనరల్‌ ఎలక్షన్స్‌ జరిగిన చోట బీజేపీ పెర్‌ఫార్మెన్స్‌ అంత బాగా లేదు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో అలాగే జరిగింది. అలాగే జాతీయ ఎన్నికల్లో నేషనల్‌ ఇష్యూస్‌ చర్చిస్తారు. కానీ రెండూ కలిపి జరిపితే బీజేపీకి నష్టం జరుగుతుందన్న భావన ఉంది. జాతీయ స్థాయిలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమౌతున్నట్టు ఇప్పటికే నితీష్‌ కుమార్‌, మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే నేపథ్యంలో ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు కూడా అన్నిటినీ కలగలిపి డిసెంబర్‌ జనవరి నెలల్లో జరపాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మూడు రోజుల క్రితం తన సలహా అడిగితే ముందస్తు పెట్టాలని చెపుతానన్నారు ఓ బీజేపీ ఎంపీ. బీజేపీ ఎంపీ నోటా ఇదే మాట రావడం… తాజాగా జగన్‌ ముందస్తు ప్రస్తావన చేశారన్న కథనాలు పెద్ద ఎత్తున రావడంతో ఏపీలో ముందస్తు ఖాయమేనా? అన్న ప్రశ్న సర్వత్రా కలకలం రేపింది. ఇప్పటికే అనేక మంది ముందస్తు ఏపీ ఎన్నికల ప్రస్తావన చాలా సార్లు చేసినప్పటికీ దాన్ని వైసీపీ పదే పదే కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని ప్రస్తావించారన్న వార్త ప్రాముఖ్యతను సంతరించుకుంది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले