హైకోర్టు స్టే ఇచ్చినా కొనసాగుతున్న బాప్టిజం ఘాట్‌ పనులు

హైకోర్టు స్టే ఇచ్చినా కొనసాగుతున్న బాప్టిజం ఘాట్‌ పనులు

Share with
Views : 94

 హైకోర్టు స్టే ఇచ్చినా మంగళగిరి పరిధిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెనాలి రోడ్డులోని డొంకభూమిలో క్రైస్తవుల కోసం ఘాట్‌ నిర్మాణం చేపడుతున్నారు.

అయితే అక్కడ పనులు ఆపాలంటూ హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌, మంగళగిరి తహసీల్దార్‌, మంగళగిరి నగరపాలక సంస్థ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది.

బాప్టిజం ఘాట్‌ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చినా పనులు కొనసాగుతుండటంపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాల వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో అక్కడి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇంకా తమకు అందలేని పోలీసులు వారికి చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దంటూ భాజపా నేతలను బలవంతంగా అక్కడి నుంచి పంపిచేశారు.

నేపథ్యమిదీ..

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి తెనాలి రోడ్డులో గల సర్వే నంబరు 138/2బీలోని స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం డొంకభూమిగా పేర్కొన్నారని, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ముప్పరాజు ప్రదీప్‌ మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు బుధవారం వాదనలు వినిపించారు. ''డొంకభూమిని కబ్జాచేసి మత మార్పిడుల కోసం నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణానికి అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నాయి. నిర్మాణ ప్రాంతానికి సమీపంలో పిటిషనర్లకు స్థలాలు ఉన్నాయి. డొంకభూమిలో నిర్మాణం జరిపితే పిటిషనర్ల స్థలాల్లోకి వెళ్లేందుకు మార్గం ఉండదు. నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలి'' అని కోరారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని రెవెన్యూ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ నిర్మాణ పనులపై స్టే ఇచ్చింది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले