*వైసీపీ నాలుగేళ్ల పాలనలో దళితుల దాడుల పై పెరిగాయి: తెదేపా

*వైసీపీ నాలుగేళ్ల పాలనలో దళితుల దాడుల పై పెరిగాయి: తెదేపా

Share with
Views : 93
*వైసీపీ నాలుగేళ్ల పాలనలో దళితుల దాడుల పై పెరిగాయి* *జగన్ రెడ్డిని గద్దె దించడానికి యావత్తు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు* *టీడీపీ మినీ మ్యానిఫెస్టోతో ప్రజలు తమ జీవితాల్లో మార్పు మొదలైందని బావిస్తున్నారు* *విజయనగరం నియోజవకర్గంలో ప్రజా చైతన్య బస్సుయాత్రలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పేరుతో రాష్ట్రంలో బస్సు యాత్రలు జరుగుతున్నాయి.* *జోన్-1 బస్సు యాత్ర కార్యక్రమం మొదటి రోజు కార్యక్రమంలో* * *పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ...* అశోక్ గారి బంగ్లా నుండి బయలుదేరి కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం RTO కార్యాలయం మరియు ఆంజనేయ స్వామి కోవెల మధ్యలో గల ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ రోడ్డు మీదుగా సోనియానగర్ లో టిడ్కొ గృహాల సందర్శన చేయడం జరిగింది మరియు లబ్ధిదారుల వద్ద నుండి వినతిపత్రం స్వీకరించారు. అనంతరం డైట్ కళాశాల రహదారి, పూలబాగ్ కోలనీ, నీళ్ల ట్యాంక్ మీదుగా అంబటిసత్రం జంక్షన్ లో రహదారుల సందర్శన చేయడం జరిగింది. ముస్లిం లు వారి సమస్యలపై పార్టీ ప్రతినిధులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మూడు లాంతర్లు జంక్షన్ లో ఉన్న మహనీయాల విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. గురజాడ అప్పారావు గారి ఇల్లు సందర్శించి, అయన విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గురజాడ అప్పారావు గారి రోడ్డు, MR కళాశాల జంక్షన్ మీదుగా పెద్ద చెరువు వద్ద గల మురుగునీటి శుద్ధి కేంద్రం (ట్రీట్మెంట్ ప్లాంట్) సందర్శించారు. అనంతరం బాలాజీ జంక్షన్ లో గల అంబెడ్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాకు చేరుకొని, భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లా నుండి బయలుదేరి ద్వారపూడి లో గల సోలార్ పవర్ ప్లాంట్ సందర్శించారు. అనంతరం గొట్లామ్ - చెల్లూరు బైపాస్ రహదారి సందర్శన చేయడం జరిగింది. అక్కడ నుండి రాకోడు గ్రామం లో డ్రిప్ ఇరిగేషన్, సోలార్ మోటార్ పంపుల సందర్శించిన నాయకులు. అనంతరం జొన్నవలస గ్రామం లో బీసీ హాస్టల్ సందర్శన చేయడం జరిగింది. అనంతరం దుప్పాడ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని, పల్లెనిద్ర చేసిన నాయకులు. *ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, శ్రీ కిమిడి కళా వెంకటరావు, శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున, జోన్ వన్ పరిశీలకులు శ్రీ బుద్ధ వెంకన్న , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కొండ్రు మురళీమోహన్, డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, శ్రీ బేబీ నాయన, శ్రీ కర్రోతు బంగారు రాజు, మాజీ స్పీకర్ శ్రీమతి కావాలి ప్రతిభా భారతి, విజయనగరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శ్రీ ఆర్పి భంజ దేవ్ మాజీ ఎమ్మెల్సీ శ్రీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ ఇంచార్జి లు శ్రీమతి కోళ్ల లలిత కుమారి, శ్రీ బొబ్బిలి చిరంజీవులు, శ్రీమతి తోయక జగదీశ్వరి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ తెంటు లక్ష్ము నాయుడు, కరణం శివరామకృష్ణ, చింతల రామకృష్ణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ గారు బొద్దుల నర్సింగరావు గారు, ఆల్తి బంగారుబాబు గారు గంటా పోలినాయుడు గారు* ముఖ్య నాయకులతో పాటు విజయనగరం నియోజకవర్గం లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. *జోన్-2* *టిడిపి చైతన్య రథయాత్ర మంగళవారం నాడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో నిర్వహించారు. తుని నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి యనమల దివ్య, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు ఆధ్వర్వంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తేటగుంట గ్రామం నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది.* అక్కడ నుండి ఎర్రకోనేరు సెంటర్ చేపూరు సెంటర్, వేలంపేట కాలనీ, తుని పట్టణం అంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి రాజా కాలేజ్ సెంటర్, గొల్ల అప్పారావు సెంటర్, రామా టాకీస్ సెంటర్ మీదుగా సాయి వేదిక ఫంక్షన్ హాల్ వరకూ చైతన్యరథ యాత్ర సాగింది. * *టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ....* వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మీ అందరి పైనా ఉందన్నారు. సంక్షేమ పథకాలకు దేశంలో శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ తిండి, బట్ట, ఇల్లు ప్రతి పేదవాడి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఆ తరువాత చంద్రబాబు ప్రతి పేదవాడూ ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో మరిన్ని సంక్షేమ పథకాలు సృష్టించారని తెలిపారు. టిడిపి హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ పాలనలో రద్దు చేశారని విమర్శించారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు టిడిపి మినీ మేనిఫెస్టో రాగానే ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా టిడిపికి ఉందన్నారు. జగన్ దోచుకున్న అక్రమ ఆస్తులను వెనక్కు తెచ్చి, ప్రభుత్వ నిధుల దుబారాను అరికట్టి, సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తామని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినీ మేనిఫెస్టోలో హామీలిచ్చామని చెప్పారు. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని యనమల ప్రకటించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, తిరిగి రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబును సిఎం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమానికి టిడిపి ఎప్పుడూ పెద్దపీట వస్తుందన్నారు. మినీ మేనిఫెస్టోలో తల్లికి వందనం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మహిళలకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు నెలకు రూ.1500 ఇస్తామని తెలిపారు. యువతకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన ప్రకటించారు. రైతులకు అన్నదాత, బిసిలకు రక్షణ చట్టం గురించి వివరించారు. రాష్ట్రమంతా ప్రజలు టిడిపికి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పులివెందులలో సైతం టిడిపి విజయపతాకం ఎగురవేస్తామని చెప్పారు. తుని నియోజకవర్గంలో కూడా టిడిపిని గెలిపించాలని యనమల పిలుపునిచ్చారు. *టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ...* * రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. టిడిపి ఆవిర్భావం నుండి పార్టీకి కంచుకోటగా ఉన్న తునిలో దురదృష్టవశాత్తూ గత మూడు పర్యాయాలుగా ఓడిపోతున్నామని, ఈసారి టిడిపి నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి పని చేసి యనమల దివ్యను గెలిపించుకోవాలని కోరారు. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయి టిడిపికి ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. *టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ...* *జగన్ రెడ్డి అరాచక పాలనపై నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలిస్తోందన్నారు. ప్రజల్లో చైతన్యం మొదలైందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ ప్రచారం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు, ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలను మించి మన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ సభ నుండే తుని నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించి ప్రచారపర్వంలోకి దిగాలని, టిడిపి ఇంఛార్జి యనమల దివ్యను గెలిపించాలని ఆయన కోరారు. *మాజీ మంత్రి, కాకినాడ పార్లమెంట్ టిడిపి సమన్వయకర్త బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ...* ఈ బస్సుయాత్ర యనమల దివ్య విజయయాత్ర అని చెప్పారు. చిత్తూరు డెయిరీని అమూల్ డైరీకి తాకట్టు పెడుతున్న సిగ్గులేని నేత జగన్మోహన రెడ్డి అని మండిపడ్డారు. అందరూ కాశీ వెళ్ళి పుణ్యం కోసం ఏదో ఒకటి వదిలేస్తామని, జగన్ అక్కడకు వెళ్ళి సిగ్గు వదిలేశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించకుండా ఊళ్ళకు దూరంగా జగనన్న కాలనీలు కడతానని పేదలను జగన్ మోసగిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. తుని నియోజకవర్గాన్ని యనమల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపితే ప్రస్తుత మంత్రి పేకాట క్లబ్బులు, బూమ్ బూమ్ బార్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. *శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, రామచంద్రపురం టిడిపి ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...* వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, ఛార్జీలు, పన్నుల భారంపై టిడిపి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు, ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ ప్రచారం చేయాలని ఆయన కోరారు. *తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ...* దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ దళితుల పైనే హత్యలు, అత్యాచారాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందని విమర్శించారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టిడిపి అన్నారు. రాష్ట్రంలో ఐదుగురు దళిత మంత్రులు ఉన్నారని, వారిలో ఒకరి పేరైనా మీకు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ వారి అక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులని చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్యను గెలిపించాలని ఆయన కోరారు. *రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ...* వైసీపీ పాలనలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రం బాగుండాలంటే తిరిగి చంద్రబాబు పాలన రావాలన్నారు. *ఈ సభలో మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, పీతల సుజాత, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, గోపాలపురం ఇంఛార్జి మద్దిపాటి వెంకట్రాజు, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, పెందుర్తి వెంకటేష్, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రత్తిపాడు టిడిపి ఇంఛార్జి వరుపుల సత్యప్రభ, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, డొక్కా నాథ్ బాబు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్, టిడిపి శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తుని ఎఎంసి మాజీ ఛైర్మన్ పొల్నాటి శేషగిరిరావు, టిడిపి నాయకులు పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసు, బూరుగుపల్లి వీరరాఘవులు, ఉండవల్లి వీర్రాజు* తదితరులు పాల్గొన్నారు. *జోన్ -3 తెనాలి నియోజకవర్గం* చైతన్య బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో, *తెనాలి నియోజకవర్గ ఇంచార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు తెనాలి నియోజకవర్గం, సంగంజాగర్లమూడి సెంటర్లో వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించి బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది.* బైక్ ర్యాలీతో బస్సు యాత్ర ప్రారంభమైంది. టీడీపీ హయాంలో నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్ ని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. క్రీడా ప్రాంగణాన్ని (ఇండోర్ స్టేడియం) చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మున్సిపల్ పార్కుని నిర్మించారు. టీడీపీ హయాంలో 70% పూర్తి చేసిన మున్సిపల్ కొత్త బిల్డింగ్ 30 శాతం పూర్తిచేయలేని దద్దమ్మ ఈ జగన్ రెడ్డి. అన్నా క్యాంటీన్లను కూడా మూసివేశారు. తెనాలి మార్కెట్ సెంటర్లో మినీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన పధకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం కానూరి రామకోటేశ్వరరావు కల్యాణ కళాసధనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మినీ మ్యానిఫెస్టోలో ఉన్న పధకాల గురించి వివరించారు... అనంతరం ఈ సమావేశంలో తెనాలి టౌన్ కి చెందిన వైసీపీ కార్యకర్తలు 30 మందికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెనాలి టౌన్ లో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను చూపిస్తూ బాధను వ్యక్త పరిచారు. తెనాలి టౌన్ లో టీడీపీ హయాంలో నిర్మించిన చాకలి ఆయిలమ్మ పార్కును పరామర్శించారు. తేలప్రోలు గ్రామంలో టిడిపి హయాంలో నిర్మించిన వాటర్ ట్యాంకులను చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.కొల్లిపర మండలం, చివలూరు గ్రామంలో టిడిపి హయాంలో నిర్మితమైన డంపింగ్ యార్డును చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఆలాగే కొల్లిపర మండలం, అత్తోట గ్రామంలో 2000 మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. *ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జి.వి ఆంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రులు నక్కా ఆనంద బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల నియోజకవర్గ ఇంచార్జ్ వేగేసన నరేంద్ర వర్మ, గుంటూరు తూర్పు ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ అహ్మద్, నందిగామ నియోజకవర్గ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు, పాతర్ల రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిట్టాబత్తిన శ్రీనివాసరావు (చిట్టిబాబు), కలపటపు బుచ్చి రాంప్రసాద్, మానుకొండ శివప్రసాద్, మద్దిరాల ఇమ్మానుయేల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, కొర్రపాటి పూర్ణచందర్, గూడపాటి శ్రీనివాసరావు, మన్నెం శివనాగామల్లేశ్వరరావు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివ సాంబిరెడ్డి, వంగా సాంబిరెడ్డి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జిల్లా బిసి విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీ కృష్ణ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు నిడమానూరి వెంకటరత్నం, జిల్లా రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు నూకవరపు బాలాజీ, యల్లావుల అశోక్ యాదవ్, వేములపల్లి శ్రీరాంప్రసాద్, గొల్ల ప్రభాకర్, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు షేక్ జానీ బేగం, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కంబంపాటి శిరీష, వడ్లమూడి పూర్ణచంద్రరావు* తదితరులు పాల్గొన్నారు. *ఈ రోజు జోన్ 5 పరిధిలోని* కర్నూలు పార్లమెంట్, *టీడీపీ పత్తికొండ నియోజకవర్గం ఇన్ చార్జీ కె.ఇ.శ్యామ్ మాట్లాడుతూ..* కర్నూలు జిల్లా దోచుకున్నది వైసీపీ నాయకులు తప్ప మరోకరు కాదని తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లురూపాయల ఘడిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం ఇన్ చార్జీ కె.ఇ.శ్యాం కుమార్ గారు పార్లమెంట్ పరిధిలోని నాయకులతో కలిసి మద్దికెర నందు బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు మద్దమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేపట్టిన అనంతరం మద్దమ్మ చెరువు దెగ్గర మద్దమ్మ కుంట చూపుతూ సెల్ఫీ ఫోటో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం స్థానిక సర్కిల్ నందు ఉన్నటువంటి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు కీ,శే,, శ్రీ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల వేసిన అనంతరం పార్టీ నాయకులు అక్కడికి చేరిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదెశంపార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గూర్చి తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది. అక్కడికి చేరిన ప్రజలందరికి భవిష్యత్ కు గ్యారెంటీ కరపత్రములను పంపిణి చేయడం జరిగింది. అనంతరం పెరవలి గ్రామంలొని మేయిన్ సెంటర్ నందు బహిరంగ సభ ఏర్పాటు చేయడమైనది. బహిరంగ సభ అనంతరం రంగనాథస్వామి ఆలయాని సందర్శించడం జరిగింది. అక్కడి నుంచి జొన్నగిరి లో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ హయాంలో 68 చెరువులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సెల్ఫీ కార్యక్రమం ముగించిన తర్వాత బహిరంగ సభలో నాయకులు పాల్గొనారు. అక్కడ నుంచి నాయకులు హోసూరు గ్రామమునకు చేరుకొని రచబండలో పాల్గొంటున్నారు. *ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, యం.ఎల్.సి బి.టి.నాయుడు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు కోత్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం ఇంచార్జీలు ఆకేపోగు ప్రభాకర్ (కోడుమూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కె.మీనాక్షి నాయుడు (ఆదోని), కోట్ల సుజాతమ్మ (ఆలూరు), మాజి జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, రాష్ట్ర పర్టీ కార్యదర్శులు నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, పార్లమెంట్ పార్టీ బి.సి సెల్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు, పార్లమెంట్ పార్టీ అనుబంధ కమిటీ ప్రధాన కార్యదర్సులు సుకన్య (మహిళా), ప్రసాద్ (లీగల్)* మొదలగు వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले