పేదల ఇళ్లపై నిజాలు దాచి మాపై బురద వేస్తే సమాజం నమ్మదు:- అచ్చెన్నాయుడు

పేదల ఇళ్లపై నిజాలు దాచి మాపై బురద వేస్తే సమాజం నమ్మదు:- అచ్చెన్నాయుడు

Share with
Views : 99
పేదల ఇళ్లపై నిజాలు దాచి మాపై బురద వేస్తే సమాజం నమ్మదు:- అచ్చెన్నాయుడు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు కట్టిచ్చేస్తాం అనేది.... సీఎం జగన్ మోసాల పరంపరలో మరో భాగం. అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం పేదలపై ప్రేమ కాదని....అమరావతి పై కక్ష అని ప్రజలందరికీ తెలుసు. మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టించిన లక్షల  టిడ్కొ ఇళ్లను నాలుగేళ్లుగా ఇవ్వని నీకు, పేదల పై ప్రేమంటే నమ్ముతారా? ఇంతెందుకు అమరావతి రాజధాని నగర పరిధిలో నిర్మించిన 5 వేలకు పైగా పేదల ఇళ్లను ఇన్నాళ్లు ఎందుకు పంపిణీ చేయలేదో చెప్పగలరా? సుప్రీంకోర్టు సూచనలు ఉన్నా...కేంద్రం అభ్యంతరాలు ఉన్నా..అన్నింటిని దాచిపెట్టి...మాపై బురద జల్లితే సమాజం నమ్ముతుందా?
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले