త్వరలో తెదేపాలో చేరతా.. వైకాపా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

త్వరలో తెదేపాలో చేరతా.. వైకాపా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Share with
Views : 97

డప: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''వైకాపా నన్ను సస్పెండ్‌ చేసింది. త్వరలోనే తెదేపాలో చేరతా. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడిని. చేరికపై జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతా'' అన్నారు.

''నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నా గ్రాఫ్‌ బాగాలేదని సీఎం చెప్పారు. నేను తప్ప ఉదయగిరిలో ఏవరూ గెలవలేరు. చంద్రబాబు టికెట్‌ ఇస్తే మరోసారి గెలుస్తా. టికెట్‌ ఇవ్వకపోయినా తెదేపాలోనే కొనసాగుతా. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేదని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే న్యాయం, ధర్మం జరుగుతుంది'' అని మేకపాటి వ్యాఖ్యానించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले