సీపీఎం అగ్రనేత సీతారం ఏచూరి సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరం

సీపీఎం అగ్రనేత సీతారం ఏచూరి సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరం

Share with
Views : 92

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను మార్కిస్ట్ పార్టీ ఖండిస్తోందన్నారు. కేసు కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ వైఖరిలో స్పష్టత లేదన్నారు సీతారాం ఏచూరి. ఒకసారి ఎన్డీయేకు దూరం అంటారు. మరోసారి మోదీతో మాట్లాడాలి అంటారు. అందుకే, పవన్ కల్యాణ్ కు క్లారిటీ లేదన్నారు.ఇక, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలుస్తామని ఎవరైనా అంటే, అది ఎన్నికల వ్యూహంలో భాగమే అని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఇటువంటి కామెంట్స్, స్టేట్ మెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారాయన. మత సామరస్యం, రాజ్యాంగస్ఫూర్తి పరిరక్షించాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సీతారాం ఏచూరి అన్నారు. 36 పార్టీల NDA ఒకవైపు, 28పార్టీల ఇండియా కూటమి మరోవైపు పోరాటానికి సిద్ధం అవుతున్నాయన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సైతం చంద్రబాబు అరెస్ట్ పై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు కరెక్ట్ కాదన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదన్నారు. త్వరలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా సీపీఎం అగ్రనేత సీతారం ఏచూరి సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले