నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది :తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది :తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Share with
Views : 155

మరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారందరిపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

శాంతియుతంగా చేసే నిరసనలపై పోలీసులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. సీఎం జగన్‌ చట్టాన్ని చుట్టంలా వాడుకుంటూ కొంత మంది పోలీసులను వైకాపా ప్రైవేటు సైన్యంలా మార్చుకొని అరాచకాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదని.. చివరకు గాలి పీల్చాలన్నా జగన్ అనుమతి కావాలంటారేమోనని వ్యాఖ్యానించారు. ఇలాంటి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. జగన్ చేస్తున్న అరాచకాలను బడుగు, బలహీన వర్గాల ప్రజలు భరించలేకపోతున్నారని అన్నారు. 'ఏపీ నీడ్స్ జగన్'.. కాదు 'ఏపీ హేట్స్ జగన్' అని ప్రజలు పిలుపునిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले